బిర్యానిలో లెగ్ పీస్ రాలేదని మంత్రి KTR కు ట్వీట్..


ట్విట్టర్ లో ఎక్కువగా ఆక్టీవ్ గా ఉండే మంత్రి KTR కి వింత అనుభవం ఎదురైంది.ఓ వ్యక్తి ఎక్స్ ట్రా మసాలా విత్ లెగ్ పీస్ తో బిర్యానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానని,కానీ అవేవి రాలేదంటూ మంత్రి KTR,జోమటోను ట్యాగ్ చేసాడు.ఐతే తనకు చేసిన ట్వీట్ పై మంత్రి KTR స్పందించారు.ఈ విషయంపై తననేందుకు ట్యాగ్ చేసావని మంత్రి విస్మయం వ్యక్తం చేసారు.తన నుండి ఎం కోరుకుంటున్నావ్ అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. అయితే నిమిషాల వ్యవధిలో ఈ ట్వీట్ వైరల్ అవడంతో తన పరువు పోయిందని కాబోలు సదరు వ్యక్తి తాను చేసిన ట్వీట్ ను
తొలగించాడు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Previous
Next Post »