నీటి పుక్కిలింతతో కరోనా నిర్దారణ పరీక్ష...ICMR అనుమతి


కరోనా ఉందా లేదా అనే అనుమానంతోనే చాలా మంది సతమతమవుతున్నారు..ఇందు కోసం వేలాది మంది టెస్టుల కోసం బారులు తీరుతున్నారు..కరోనా టెస్టుకు అధిక సంఖ్యలో సంబంధిత పరికరాలు లభ్యం కాకపోవడంతోపాటు అధిక ధరలు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి.దీంతో టెస్టులకోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.ఇక మరి కొద్ది మంది మాత్రం స్కానింగ్ ద్వారా కరోనా టెస్టును చేయించుకుంటున్నారు.కానీ ఇది సాధారణ ప్రజలకు కర్చుతో కూడుకున్నది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా అధికంగానే ఉండటంతో అతి కొద్ది మంది మాత్రమే స్కానింగ్ వైపు మొగ్గుచూపుతున్నారు..ఈ నేపథ్యంలో అత్యంత సులువైన పద్దతిని తీసుకువచ్చారు పుణె శాస్త్రవేత్తలు కరోనా వైరస్ మొదలయినప్పటి నుండి అనేక రకాల టెస్టులు వచ్చాయి.కరోనా పరీక్షకు ముఖ్యంగా ఆర్ టి పి సి ఆర్,స్కానింగ్ పద్ధతుల ద్వారా నిర్దారణ చేస్తున్నారు.ఐతే ఈ పరిక్షాలతో ఫలితాలు ఉన్నా అందరికి అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.గ్రామాల్లో ఉన్న ఆసుపత్రులు ఆర్ టి పి సి ఆర్ పరీక్ష మీదనే ఆదారపడుతున్నాయి.మరో వైపు ఈ కిట్ల కొరత కూడా వేదిస్తున్నది.ఇక స్కానింగ్ ద్వారా పట్టణాల్లో మాత్రమే వ్యాధి నిర్దారణ జరుగుతుంది.


ఈ నేపథ్యంలో కారోనాను నిర్దారించడానికి మరో రకమైన విధానానికి నాగ్ పూర్ లోని  కౌన్సిల్ ఆఫ్ సైన్సు అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు అనుబంధంగా ఉన్న  నీరి అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది.నోటితో ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా కరోనా నిర్దారణ చేస్తున్నారు.ఐతే ఇది సులబతరంగా ఉండటం ఫలితాలు తొందరగా రావడంతో పాటు పెద్దగా పరికరాలు కూడా అవసరం లేకుండానే వ్యాధి నిర్దారణను కేవలం మూడు గంటలలోనే చేయవచ్చని నిపుణులు అంటున్నారు.ఈ పరీక్షల కోసం ICMR కూడా అనుమతులు ఇచ్చింది.దీంతో పూణేలో ఇటువంటి పరీక్షలు చేస్తున్నట్లు నీరి శాస్త్రవేత్తలు తెలిపారు.

Previous
Next Post »