తమిళనాడులోని మదురై జిల్లాలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది.కోవిడ్19 వైరస్ కు విరుగుడుఅంటూ చనిపోయిన పామును నమిలి తిన్నాడు ఒక వ్యక్తి.. పైగా పామును తింటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు..పామును తింటే కరోనా వైరస్ సోకదని సదరు వ్యక్తి ఆ వీడియోలో చెప్పడం గమనార్హం. ఈ వీడియో కాస్త ఫారెస్ట్ అధికారుల దృష్టిలో పడడంతో అధికారులు అతన్ని అరెస్టు చేసి,రూ 7వేల జరిమానా విధించారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...తమిళనాడులోని కరోనాకు విరుగుడు అంటూ పామును నమిలి మింగిన వ్యక్తి...తరువాత ఎం జరిగిందంటే...! మదురై జిల్లా పెరుమపట్టి ప్రాంతానికి చెందిన వ్యవసాయ కార్మికుడు బడివేలు (50) కరోనాకు విరుగుడు అంటూ పాములను తినడం ప్రారబించాడు.ఈ క్రమంలో తాజాగా ఒక పామును నమిలి మింగాడు.పామును తినే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.పామును తింటే కరోనా సోకదని అందుకని అందరూ పాములను తినాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు.ఈ వీడియో కాస్త అటవీ శాఖ అధికారుల దృష్టిలో పడటంతో ఈ ఘటనను వారు సీరియస్ గా తీసుకున్నారు.పామును తిన్న వ్యక్తిని పట్టుకోవాలని జిల్లా అటవీ అధికారి ఎస్ ఆనంద్ అధికారులను ఆదేశించారు.దానితో వారు వదివేలును అదుపులోకి తీసుకున్నారు.అతనికి రూ. 7 వేల జరిమానా కూడా విధించారు.కాగా పామును తిన్న సమయంలో మద్యం మత్తులో ఉన్నట్టు వడివేలు అంగీకరించాడు.కరోనాకు ఎదుర్కోవాలంటే పాములను తినాలని తనను కొందరు బలవంతం చేసారని వడివేలు అధికారులకు చెప్పాడు.
ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే విషపూరిత పామును తిన్నప్పటికి వదివేలుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.ఇది అతని అదృష్టంగా పేర్కొంటున్నారు అదికారులు.ఏదేమైనా పాములను తినడం ద్వారా కరోనా కట్టడి కాదని,ఇలా మరెవరూ పిచ్చి పనులు చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.అటవీ జంతువులకు హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ConversionConversion EmoticonEmoticon